ప్రచారం రూ.15 వేలు… అమలేమో రూ.12 వేలు…రైతు భరోసాపై కేటీఆర్ కౌంటర్‌ !

-

ప్రచారం రూ.15 వేలు… అమలేమో రూ.12 వేలు అంటూ…రైతు భరోసాపై కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. నిన్న రైతు భరోసా రూ.12మాత్రమే ఇస్తానని రేవంత్‌ రెడ్డి ప్రకటన చేసిన తరుణంలో.. కేటీఆర్‌ రియాక్ట్‌ అయ్యారు. ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం… మోసానికి మారు పేరు కాంగ్రెస్ అంటూ ఆగ్రహించారు. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్… రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఫైర్‌ అయ్యారు. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని… ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం అంటూ మండిపడ్డారు.

KTR revanth over rythu bharosa

అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దం… రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం అంటూ రెచ్చిపోయారు కేటీఆర్‌. ప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు అన్నారు. సిగ్గు సిగ్గు… ఇది సర్కారు కాదు… మోసగాళ్ల బెదిరింపుల మేళా అంటూ సెటైర్లు పేల్చారు కేటీఆర్. అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్… మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version