సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం.. సినిమాటోగ్రఫీ మంత్రి కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక పాలసీని సిద్ధం చేస్తున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పుష్ప-2 సినిమా సందర్భంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాట సందర్భంగా మహిళా మరణించడంతో ఇండస్ట్రీ పై వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి  కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ద్వారా రాష్ట్రంలో ఉన్న అంశాలు ప్రస్తావించేలా పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో నిర్మాతలు, దర్శకులు అందరికి పవన్ కళ్యాణ్  నేతృత్వంలో ఒక సినిమా పాలసీని తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ ఒక అందాల హరివిల్లు అని.. అనేక రకాల ప్రకృతి సౌందర్యాలున్నాయి.  అటువంటి రాష్ట్రంలో ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తరపున కోరుతున్నాను ఇక్కడ సినిమాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పరచడానికి ముందుకు రండి. సినిమా పరిశ్రమకు కూడా ఒక పాలసీ ఇచ్చి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది అని తెలిపారు మంత్రి దుర్గేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version