BGT సిరీస్ లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత BGT సిరీస్ కోల్పోయింది టీమిండియా. దీంతో ఈ సిరీస్ ఆస్ట్రేలియా చేతికి వెళ్లింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆస్ట్రేలియాకు దక్కింది. ఐదో టెస్టులో భారత్ ఓటమిపాలవడంతో ఆసీస్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 162 లక్ష్యాన్ని ఛేదించింది.
ఖవాజా 41, హెడ్ (34*), వెబ్‌స్టర్ (39*) కీలకమైన రన్స్ నమోదు చేశారు. సామ్ కొనస్టాస్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు.