ట్విట్టర్ వేదికగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
తెలంగాణ అంటేనే పోరాటాల అడ్డాలాంటిది.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం గతంలో అనేక ఉద్యమాలు జరిగిన నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాట ఫలితంగానే అంతిమంగా రాష్ట్రాన్ని సాధించాం.. ఈ క్రమంలో అనేక మంది అమరులైయ్యారు అంటూ గుర్తు చేసుకుంటూ… కాంగ్రెస్ నేతల పదేపదే కేటీఆర్ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించడాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర సాధన ఉద్యమంలో నేను సైతం అంటూ తనవంతు పాత్ర పోషించిన రోజులను గుర్తుచేసుకున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఎక్కడ ఉన్నానన్న స్కాంగ్రెస్ నేతలకు నా జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నా. స్కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని అడ్డుకుంటే మేం ఎంతగానో శ్రమించాం. నాటి కష్టాల ఫలితంగా 2014లో నేను నేరుగా మంత్రి బాధ్యతలు చేపట్టాను అంటూ ఉద్యమ కాలంలోని ఫొటోలని పంచుకున్నారు.
Want to refresh the memory of some Telangana Scamgress men who keep hallucinating that I landed straight into a ministry in 2014
Where were you when I was in the movement for 8 years (2006-14) alongside people of Telangana?
Guess you were busy plotting to suppress the agitation pic.twitter.com/536tQlXB2s
— KTR (@KTRTRS) October 15, 2018
2006-14 మధ్యకాలంలో 8 ఏళ్లు రాష్ట్ర ప్రజలతో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నాను. కానీ అదే సమయంలో కాంగ్రెస్ నేతలు ఉద్యమాన్ని నీరుగార్చడంలో మీరు ఎక్కడెక్కడ బిజీగా ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలంటూ’ వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.