విశాఖ- సికింద్రాబాద్‌ల మధ్య నడుస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి వరకు నడపనున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ.. ఏప్రిల్14నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. నగర శివార్లలోని లింగంపల్లి,హైటెక్‌సిటీ,చందానగర్ పరిసరప్రాంతాల్లో ఉండేవారు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలంటే సికింద్రాబాద్ వరకువెళ్లాల్సిన పరిస్థితి ఉంది దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ప్రయాణికులసౌకర్యం, వారి డిమాండ్ కారణంగా లింగంపల్లి నుంచే రైలు ఎక్కే వెసులుబాటు కల్పించనున్నారు.ఇప్పటికే గౌతమి, కొకనాడ, నారాయణాద్రి,విజయవాడ ఇంటర్‌సిటీఎక్స్‌ప్రెస్ రైళ్లను లింగంపల్లి వరకు నడుపుతున్నారు.
విశాఖ-లింగంపల్లి: 12805 నెంబరు గల రైలు ఏప్రిల్ 14 నుంచి రోజు మాదిరిగానే ఉదయం 6.15 గంటలకు విశాఖలో బయల్దేరి సాయంత్రం 6.45 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.అక్కడి నుంచి 6.55కి బయల్దేరి బేగంపేటకు 7.09కి, లింగంపల్లికి రాత్రి 7.40కి చేరుకుంటుంది. అలాగే 12806 నెంబరు గల రైలు ఏప్రిల్ 15 నుంచి లింగంపల్లిలో ఉదయం 6.15కి బయల్దేరి బేగంపేటకు 6.38కి, సికింద్రాబాద్‌కు 7 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 7.10కి బయల్దేరి అదే రోజు రాత్రి 7.40 గంటలకు విశాఖపట్నం చేరుకోనుంది. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం తో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికుల రద్దీసగానికి సగం తగ్గనుంది.