ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజే వెలువడనున్నాయి. ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరీంనగర్ లోని ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. 753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు హాళ్లు, 14 టేబుళ్లు, 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది.
సాయంత్రం 4 తర్వాత పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలింగ్ 86.64 శాతం గా నమోదు అయ్యింది. మొదట హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట ఈవీఎం తెరిచి లెక్కిస్తారు. అంతే కాకుండా చివరిగా కమలపూర్ మండలం శంబునిపల్లి గ్రామ ఈవీఎం ను లెక్కిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఫలితం పై ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ బాద్ షా ఎవరవుతారా అని ఎదురుచూస్తున్నారు.