అదుపు తప్పి  కలెక్టర్ కారు బోల్తా…పరిస్థితి విషమం

-

కుక్కను తప్పించబోయి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారిని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, వారి కుమారుడు సిద్దార్థ్ రెడ్డిగా  గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డిప్యూటీ కలెక్టర్ పరిస్థతి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news