అన్నామలైపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు..

-

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి నాయకుడని, బీజేపీ కుటుంబ పార్టీ కాదని అందరికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈరోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…యువకుడు ఐపీఎస్ క్యాడర్ వదిలేసి బీజేపీలో చేరారని, ఒక వేళ ఆయన డీఎంకేలోకి వెళ్తే పెద్ద పేరు తెచ్చుకునే వారు కానది చెప్పారు. ప్రతీ కార్యకర్తకు బీజేపీ అవకాశం ఇస్తుందని, కుటుంబ పార్టీల్లో ఇలాంటివి ఉండవని అన్నారు.

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ…మహాత్మా గాంధీ పేరుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ, మెడలో రుద్రాక్ష మాల ధరించిన ఇందిరా గాంధీతో సంబంధం ఉన్న కాంగ్రెస్, సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్న డీఎంకేతో ఎందుకు అంటకాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. డీఎంకే నేతలు ప్రత్యేక దేశం అని పలుమార్లు మాట్లాడిందని, ఇండియా పూర్తిగా వైవిధ్యం కలిగిన దేశమని ప్రధాని సమాధానమిచ్చారు. బీజేపీ 400 స్థానాలు గెలిస్తే ఒకే భాష, ఒకే మతం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని మండిపడ్డారు .ఐక్యరాజ్యసమితికి వెళ్లి ప్రపంచంలోనే అతి పురాతన భాష ‘తమిళం’ అని చెప్పిన వ్యక్తి గురించి ఎలా విమర్శి్స్తున్నారో నాకు అర్థం కావడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version