అప్పుడు బాబాయ్.. ఇప్పుడు చెల్లి.. కాంగ్రెస్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు…

-

తిరుపతి: కాంగ్రెస్ పైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో మా బాబాయ్‌ను నాపై పోటీకి నిలబెట్టారు.ఇప్పుడు మా సోదరి షర్మిలనీ ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.ఈరోజు ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ…ఏపీలో కాంగ్రెస్‌ చెత్త రాజకీయం చేస్తుంది.. దేవుడు వాళ్లకు గుణపాఠం చెబుతాడు.. గతంలోనూ మా బాబాయ్‌ని మంత్రిని చేసి మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిలబెట్టింది.. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్‌.. ఈ సారి మా సోదరిని ప్రయోగించింది. తమ కుటుంబాన్ని విడగొట్టి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు… కుటుంబాల్లో విభేదాలు సృష్టించి పాలిటిక్స్ చేస్తోన్న వాళ్లకు దేవుడే బుద్ధి చెబుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకి ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం లేదని తెలిపారు. టీడీపీ, జనసేన పార్టీలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పోటీ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని  ఆయన స్పష్టం చేశారు. ఇష్యూ బేస్డ్ విషయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సర్వేలలో ప్రజా వ్యతిరేకత వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది ఆశ భావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version