అమెరికాలోని తెలుగు వారి కోసం పనిచేసే సంస్థలు పెద్ద సఖ్యలోనే ఉన్నాయి. ప్రతీ సంస్థ అమెరికాలో నివసించే తెలుగు వారి అభివృద్ధికి తోడ్పడేలా కృషి చేస్తాయి. ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎల్లప్పుడూ తోటి వారికి సహాయపడుతూ ఉంటారు. అంతేకాదు, భారతీయ సాంప్రదాయాలను తమ వారుసులకు కూడా అందిచే దిశగా అడుగులు వేస్తూ, అన్ని పండుగలను జరుపుకుంటూ, వాటి విశిష్టతను పిల్లలకు తెలియచేస్తున్నారు..అలాంటి సంఘాలలో ఆట కూడా ఒకటి..తాజగా…
ఆటా(అమెరికన్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. మార్చి 8వ తేదీన న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలస్ లో ఈ వేడుకలు జరపడానికి ఆటా సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని కోసం ఒక పోస్టర్ ను కూడా తాయారు చేసుకున్నారు ఆటా టీం..
ఈ వేడుకలలో భాగంగా డిజే మ్యూజిక్, డ్యాన్సెస్, ఫ్యాషన్ షో, మరియు ప్రముఖులతో ప్రసంగాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ వేడుకలు మార్చి 8వ తేదీన ఉదయం 11 గంటలకు మొదలై, సాయంత్రం 4 వరకు కి ముగియనున్నాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలకోసం ఆట నిర్వాహకులు ఇందిరారెడ్డి (732 476 8745), విజయ్ నాదెళ్ళ (610 504 4504), నివాని ఐత (212 960 8632) లని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఫీజు భోజనం తో కలిపి 15 డాలర్లుగా నిర్ణయించారు.