అయోధ్య రాములోరికి అతి సూక్ష్మ స్వర్ణ పాదుకలు…..

-

శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య నగరం అంతా అంగరంగ వైభవంగా ముస్తాబయింది. విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముడికి నల్లగొండ జిల్లాకు చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు బంగారు పాదుకలను తయారుచేశాడు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి కి చెందిన స్వర్ణకారుడు చోల్లేటి శ్రీనివాస చారి అతి చిన్న పాదుకలను అయోధ్యలోనే శ్రీరామునికి కానుకగా తయారు చేశారు. కేవలం 0. 130 మిల్లి గ్రాముల బంగారాన్ని వినియోగించి ఎనిమిది మిల్లీమీటర్ సైజుపొడవు , 4 మిల్లీమీటర్ సైజు వెడల్పుతో రెండు పాదుకలను తయారు ఇది తయారుచేయడానికి కేవలం ఒక గంట సేపు మాత్రమే సమయం పట్టిందని శ్రీనివాస చారి తెలియజేశాడు.

రాముడుపై ఉన్న భక్తితో తన కళను నెరవేర్చుకోవడానికి శ్రీరాముడికి స్వర్ణ పాదుకలు సమర్పించుకుంటున్నానని అన్నారు.ప్రజలందరూ శ్రీరాముడిపై ఉన్నభక్తిని వివిధ మార్గాల్లో చాటుకుంటున్నారు. గతంలో జాతీయ పతాకం ,శివలింగం, బతుకమ్మ, రాకెట్ నమూనా, భారతదేశ పటం వంటి వాటిని అతి చిన్న సైజు లో తయారుచేసి పలువురి మన్ననలుపొందారు

Read more RELATED
Recommended to you

Latest news