అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటెల రాజేందర్

-

తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి సమస్యల పై ఐదు సంవత్సరాలుగా నేను కూడా మీలాగే కొట్లాడుతున్నాను. ఆర్థిక మంత్రి కాకముందు మాకు ఇంత అవగాహన లేకుండే.. ఆర్థిక మంత్రిగా కాంట్రాక్టు ఉద్యోగులకు కొంచెం స్కేల్ పెంచి వారిని గుర్తించినప్పటికీ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం అది జరగలేదు. ఆయా డిపార్ట్మెంట్ వారే ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసుకుని కమిషన్ లేకుండా ప్రభుత్వం ఎంత ఇస్తే అంత ఇవ్వమని చెప్పాము.

అడ్డ మీద కూలీలకు 600 నుంచి 800 కూలి వస్తుంది, చదువుకున్న ఉద్యోగులకు మాత్రం 400 రూపాయలు వచ్చేవి దాన్ని సవరించాలని ఆరోజు మేము ప్రయత్నం చేశాం. మేము వచ్చాక మొదటి PRC లో పెంచే ప్రయత్నం చేశాం. చదువుకున్న మనుషులకు వచ్చే జీతాల కంటే అడ్డ మీద కూలీలకు ఎక్కువ జీతం ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళకి కొంత గౌరవప్రదమైన వేతనం ఉండాలని చూశాం. మొత్తం సిస్టంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేసే అంత వెట్టి చాకిరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేయరు.ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను.. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగుల లాగా వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ఆరోగ్య పరమైన సమస్య వస్తే వీరికి కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను, ఆటోమేటిక్ రెన్యువల్, PRC ఎలా పెంచుతారో అదే పద్ధతిలో వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Latest news