అసలు సినిమా ముందుంది, నెల రోజుల్లోనే వ్యతిరేకత మొదలైంది- కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

-

కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు 420 హామీలు అని కేటీఆర్ విమర్శించారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇద్దామనుకున్నాం. కానీ, గవర్నర్ ప్రసంగం, శ్వేత పత్రాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని,బీఆర్ఎస్ ను నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మా మీద అకారణంగా నిందలు వేస్తె ఊరుకునేది లేదని ,అందుకే అసెంబ్లీలో కాంగ్రెస్ ను గట్టిగా నిలదీశామని తెలిపారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే నిలదీస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదని, అసలు సినిమా ముందుందని, నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ ప్రభుత్వం.. 420 హామీల్లో నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనేలేదని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క అబద్దమాడారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రద్దు చేస్తోందని ఆయన అన్నారు. పేదలకు మనం అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version