ఈ గ్రామం..ఓటింగ్‌కి దూరం..

-

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌కి సంబంధించి శుక్రవారం వరకు కోలహాలం కొనసాగింది. అయితే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని మొట్ల తిమ్మాపూర్‌ మాత్రం ఎన్నికలను బహిష్కరించింది. ఈ గ్రామం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. విషయం ఏంటా అని మందలిస్తే వారి గ్రామం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచినప్పటికీ ..అటవీ ప్రాంతంలో ఉన్న తమ గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేడన్నారు. కనీస సౌకర్యాలకు కూడా తాము నోచుకోలేదని, ఒక్క నాయకుడు కూడా తమ గ్రామాన్ని పట్టించుకోలేదేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ఏదో విధంగా నాయకులు ఇక్కడికి చేరుకుని అదిచేస్తాం, ఇది చేస్తాం ఓటెయ్యండి అంటూ చెప్పినంత మాత్రాన ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ బతిమాలినా ఓటర్లు ఎవరూ ముందుకు రాలేదు. చేసేదేం లేక అధికారులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 69.1 శాతం ఓటింగ్ నమోదైంది. చాలా నియోజకవర్గాల్లో ఓటు వేసేందుకు ప్రజలు పోటెత్తారు. ఖమ్మం జిల్లా మధిరలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్‌లోని మలక్‌పేటలో అత్యల్ప ఓటింగ్ నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version