తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని ఐటీ అధికారులు బషీర్ బాగ్ లోని కార్యాలయంలో బుధవారం దాదాపు 6 గంటల పాటూ ప్రశ్నించారు. రేవంత్ ఇంట్లో లాప్‌టాప్, హార్డ్ డిస్కులు, పత్రాలను గత వారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఆస్తుల సంపాదన, వ్యాపార లావాదేవీలు, ‘ఓటుకు నోటు’ కేసులో 50 లక్షల గురించి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వీడియో రికార్డింగ్ ద్వారా విచారణ చేపట్టారు. ఈ నెల 23న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి … ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీలు కలిసి ఐటీ, ఈడీలను ఉపయోగించుకొని దాడులు చేస్తున్నారని విమర్శించారు.