ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. ఎన్టీఆర్ ‘దేవ‌ర’ గ్లింప్స్ రిలీజ్

-

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ చిత్రంలో అలనాటి తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కథానాయికగానటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్న తారక్ ‘దేవర’ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేసింది.

ఒక నిమిషం 19 సెకన్లు ఉన్న ఈ గ్లింప్స్‌ ఫుల్ యాక్ష‌న్ మోడ్‌లో ఉంది. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో మాస్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.ఇక వీడియో చివ‌రిలో ఎన్టీఆర్ చేప్పే ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారుస అనే డైలాగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news