జనాభా రేటును పెంచుకోవడానికి జపాన్‌ తిప్పలు..బిడ్డ పుడితే లక్షల్లో చెల్లింపులు

-

పిల్లలను కనడం మరియు పెంచడం సులభం కాదు. కానీ మీరు జపాన్‌లోని నాగికి వెళ్లిన తర్వాత పిల్లలను కనడం, పెంచడం రెండూ తెలిక అవుతుంది. ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన నగరం, ఇక్కడ మహిళలు, పురుషులు పిల్లలను పెంచడం ఎలాగో నేర్పుతారు. ఇలా చేసినందుకు వారు ఫీజు కూడా తీసుకుంటారు..కానీ ఒక్కసారి పిల్లలను కంటే.. మీకే ఎదురు డబ్బులు ఇస్తారు. ఈ వెరైటీ నగరం గురించి మరిన్ని ఆసక్తి విషయాలు చూద్దామా..!
జపాన్‌లోని నాగీ నగరంలో పిల్లలను ఎలా కనాలి, ఎలా పెంచాలో బోధించినుందుకు ఫీజు తీసుకుంటారు. మొదటి బిడ్డకు 420 డాలర్లు, రెండో బిడ్డకు 210 డాలర్లు.. ఇంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే డబ్బు తీసుకోరు. ఈ నగరంలో ప్రతి స్త్రీ తల్లిలానే అందరిని చూసుకుంటుంది. చాలా మంది పిల్లలు ఇక్కడకు వస్తారు. ఆ పిల్లలందరినీ అక్కడి స్త్రీలు తల్లిలా చూసుకుంటారు. ఎవరైనా తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తే పిల్లలకు లక్ష రూపాయల ఉపకార వేతనం కూడా ఇస్తున్నారు. జనన రేటును పెంచడానికి ఇలా చేస్తున్నారు. ఈ గ్రామం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇక్కడి ప్రత్యేకత దృష్ట్యా చాలా మంది తల్లిదండ్రులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు.
జనాభాను పెంచడానికి (జనన రేటును పెంచడానికి) అన్ని రకాల బహుమతులు ఇచ్చే దేశాలలో జపాన్ ఒకటి. ఎక్కువ మంది పిల్లలను కనాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశ జనాభాలో దాదాపు 30 శాతం మంది వృద్ధులే. 2% మంది 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. కాబట్టి ఈ కొత్త చర్య నాగి నగర్‌లో అమలు చేస్తున్నారు.
నాగి టౌన్ జపాన్‌లో అత్యధిక జనన రేటును కలిగి ఉంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించినట్లుగా, 6,000 కంటే తక్కువ జనాభా ఉన్న ఈ నగరంలో తల్లిదండ్రులు పిల్లలను కనే పద్ధతులను నేర్చుకుంటారు. నాగి నగరంలో పిల్లల బాగోగులు చూసే కమిటీ ఉంది. వారి మనస్సు మరియు శరీరం సరిగ్గా అభివృద్ధి చెందడానికి వారికి మంచి సౌకర్యాలను ఇస్తుంది. ఈ నగరంలో నివసించే ప్రతి స్త్రీ ఒక తల్లిగా పని చేస్తుంది.
జపాన్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ పిల్లలను ఇక్కడ పాఠశాలలో చేర్పిస్తారు. ఈ పిల్లలకు ఏటా 80 వేల నుంచి 1.5 లక్షల రూపాయల వరకు స్టైఫండ్ ఇస్తారు. ప్రతి తదుపరి బిడ్డ పుట్టుకతో ఇది రెట్టింపు అవుతుంది. అంటే, మొదటి బిడ్డ పుట్టిన సమయంలో $ 879 అందుకుంటే, మూడవ బిడ్డ పుట్టిన తర్వాత 3,518 చెల్లిస్తారు. దీంతో పాటు పిల్లలకు వసతి, ఉచిత వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news