ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌పై మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐటీ అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనవ్యాజ్యంపై నేడు ఉమ్మడి హైకోర్టు విచారణ జరపనుంది. ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్ వేమూరి రవికుమార్, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డితో కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారంటూ పిటిషన్‌లో మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేసి భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని పిటినర్ తెలిపారు. అభివృద్ధి, రాజధాని నిర్మాణం పేరుతో భారీ దోపిడి జరుగుతోందని పేర్కొన్నారు.