భాజపేతర శక్తుల కూటమి ఏర్పాటుకు…
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తేదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు మంగళవారం ఫోన్ చేసి జాతీయ రాజకీయాల గురించి చర్చించినట్లు సమాచారం. త్వరలో రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీలన్నీ భాజపేతర పార్టీలన్ని ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని అఖిలేష్ బాబుతో అన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఐక్య కూటమి ఆవశ్యకత, దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది..ఈ పరిణాల కారణంగా మరో సారి తెదేపా అధినేత నవంబర్ ఒకటిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు మళ్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత వారంలో ఢిల్లీ వెళ్లిన సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటూ పలు పార్టీల నేతల్ని కలిసిన విషయం తెలసిందే.. అఖిలేష్ ఫోన్ కాల్ తో రాజకీయాల్లో తీవ్ర చర్చకొనసాగుతోంది.