లిటిల్ బర్డ్ గా నిహారిక..!

-

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరశపరచాయి. అమ్మడి అభినయానికి మంచి మార్కులే పడ్డా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఒక మనసు కనీసం ప్రీ రిలీజ్ బజ్ అయినా ఏర్పడింది. సెకండ్ మూవీగా వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ అది కూడా ఏర్పరచుకోలేదు. ఇదిలాఉంటే ప్రస్తుతం నిహారిక తన 3వ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టిందని తెలుస్తుంది.

సీనియ హీరోయిన్ శ్రీయాతో కలిసి ఏ లిటిల్ బర్డ్ సినిమా చేస్తుందట నిహారిక. సుగుణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఏ లిటిల్ బర్డ్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా తీస్తున్నారట. అక్క చెల్లి మధ్య జరిగే మానసిక సంఘర్షణ ఈ సినిమా కథాంశం అని తెలుస్తుంది. ప్రస్తుతం సమాజ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఎలాగు తనని గ్లామర్ హీరోయిన్ గా మెగా అభిమానులు ఒప్పుకోరనుకుందో ఏమో నిహారిక ఈసారి భారీ ప్రయోగంతోనే రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో శ్రీయా ఉంది కాబట్టి తప్పకుండా విషయం ఉండే ఉంటుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో వెళ్లడిస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news