ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుందంటే…?

-

బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి ఎక్కువ వడ్డీని పొందాలనుకుంటున్నారా…? ఏ బ్యాంక్ లో డబ్బులని పెట్టాలో అర్ధం కావడం లేదా..? అయితే ఈ విషయాలు మీకోసం. ఎక్కవ వడ్డీ ఎక్కడ లభిస్తుంది..? ఎంత వడ్డీ వస్తోంది..? ఇలా అనేక విషయాలు మీకోసం. ఈ వివరాలని పూర్తిగా చూసేసి ఎక్కడ డబ్బులు డిపాజిట్ చెయ్యాలో నిర్ణయించుకోండి. ఇక వివరాల లోకి వెళితే… బ్యాంక్ ఎఫ్‌డీల్లో డబ్బులు దాచుకోవడం వల్ల రూ.5 లక్షల వరకు ఎలాంటి రిస్క్ ఉండదు.

అంతే కాదండి అదిరిపోయే రాబడి మీ సొంతం. అన్ని బ్యాంకుల్లో ఒకే రకమైన వడ్డీ రాదు గమనించండి. అలానే డబ్బులని ఎఫ్డీ చేసిన సమయాన్ని బట్టి కూడా ఒడ్డి రేటు మారుతుంది గుర్తుంచుకోండి. ఏది ఏమైనా ఎక్కువ వడ్డీ కలిగే చోట డబ్బులు పెడితే మంచి లాభం వస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  లో కనుక ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే… మీకు వచ్చే వడ్డీ 2.9 శాతం నుంచి 5.4 శాతం ఉంటుంది. అదే మీరు సీనియర్ సిటిజన్స్‌ అయితే 3.4 శాతం నుంచి 6.2 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద 3 శాతం నుంచి 5.3 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 6.15 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ అయితే 2.5 శాతం నుంచి వడ్డీ పొందొచ్చు. 5.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. అలానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కనుక ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే… 5.3 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 6.15 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అయితే 2.5 శాతం నుంచి 4.9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news