టాలీవుడ్లో వరుసగా సినిమాల రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసుకుంటూ వెళుతున్నారు దర్శక నిర్మాతలు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు ఇప్పటికే దాదాపుగా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. తాజాగా ఈ కోవలోనే అల్లు అర్జున్ కూడా తన పుష్ప సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 13న థియేటర్లలోకి వస్తున్నానని మీ అందర్నీ థియేటర్లలో కలవడం ఎగ్జైటింగ్ గా ఉందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.

సుకుమార్, డిఎస్పితో కలిసి మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేస్తానని నమ్మకం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మారేడుమిల్లి అడవులలో జోరుగా సాగుతోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ డి గ్లామర్ లుక్ లో కనబడుతున్నాడు. బన్నీ సుకుమార్ ది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021