గణతంత్ర దినోత్సవం నాడు ఎర్ర కోట మీద జాతీయ జెండాతో పాటు మరో జెండా ఎగరవేసిన పంజాబీ సింగర్ దీప్ సిద్దు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి నుంచి దీప్ సిద్దు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆయన ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయగా చివరి లొకేషన్ హర్యానా గా చూపిస్తోంది. ఎర్ర కోట ముట్టడి కేసులో దీప్ సిద్దు మీద పెద్ద ఎత్తున అభియోగాలు మోపారు. రైతులను దీప్ సిద్ధూ రెచ్చగొట్టారని ఆరోపణ ఉన్నాయి.
గ్యాంగ్స్టర్ లఖా సుధాన పైన కూడా కేసు నమోదైంది. ఇక రైతు సంఘం నేత దర్శన్ పాల్ కూడా పోలీసులు నోటీసులు అందజేశారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ అంశాల మీద మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 22 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. అయితే ఈ ఎర్రకోట ఘటనను దీప్ సిద్ధూ సమర్థించుకున్నాడు. ఈ కోట ముట్టడిలో తప్పేమీ లేదని ఆయన గతంలో వ్యాఖ్యానించాడు.