ఒకప్పటి ఈ టాలీవుడ్ పాప.. ఇప్పుడు హాలీవుడ్ సెన్సేషన్.. హాలీవుడ్‌లో తెలుగమ్మాయి రచ్చ..

-

అవంతిక వందనపు.. అంటే ఎవరు తనని గుర్తుపట్టలేరేమో. కానీ కృష్ణగాడి వీర ప్రేమ గాధ,బ్రహ్మోత్సవం, ప్రేమమ్ ,అజ్ఞాతవాసి మూవీ లోని చైల్డ్ ఆర్టిస్ట్ అంటే వెంటనే గుర్తుపడతారు. తెలుగమ్మాయి అవంతిక చిన్నప్పుడు తెలుగు, తమిళ్ చిత్రాలతో మెప్పించింది. అయితే అవంతిక కుటుంబం అమెరికా వెళ్లి అక్కడ స్థిర పడడంతో అవంతిక అక్కడ కూడా నటననే కెరీర్ గా ఎంచుకొని అక్కడ చిత్రాలలో నటించడం మొదలుపెట్టింది.

మొదట పలు హాలీవుడ్ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన అవంతిక , తర్వాత హాలీవుడ్ లో స్పిన్ అనే చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది,. ఆ తర్వాత సీనియర్ గర్ల్ అనే చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేసింది. ప్రస్తుతం మీన్ గర్ల్స్ అనే మూవీతో ఇప్పుడు హాలీవుడ్ లో సెన్షేషన్ సృష్టించింది.ఈ చిత్రం జనవరి 12 న హాలీవుడ్ లో విడుదల అయింది.ఈ సినిమాలో అవంతిక పాత్ర, ఆమె డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవంతికని ఈ విధమైన బోల్డ్ డ్యాన్స్ లో చూసిన తెలుగు ఆడియన్స్ ఆ పాప ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news