
ఓ

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సినీ నటులు, రాజకీయనాయకులు తదితర ప్రముఖులు శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.తెలుగు నటులుచిరంజీవి, శ్రీకాంత్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లి హిల్స్‌లో ఓటేశారు. నటుడు, నిర్మాతఅక్కినేని నాగార్జున అమలతో కలిసి వెళ్లి ఓటేశారు. అల్లుఅర్జున్, నితిన్, వడ్డేనవీన్, బ్రహ్మాజీ సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాట్మింటన్ కోచ్ పుల్లెలగోపీచంద్, పీవీసింధూతమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఉదయం 7గంటలకే మంత్రులు హరీష్ రావు, జగదీష్రావులు శుక్రవారం ఉదయమే పోలింగ్ బూత్‌లకు చేరుకుని తమ ఓటు హక్కువినియోగించుకున్నారు. హరీష్ రావు సిద్ధిపేటలోను, జగదీష్రావు సూర్యాపేటలోను ఓటేశారు. కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిమెహదీపట్నంలో ఓటేశారు. కాస్త మందకోడిగా సాగుతున్న పోలింగ్ సరళిలో మధ్యాహ్నానంనాటికి పోలింగ్ శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది.