కోస్తాకు ‘టిట్లీ’ తుఫాను ముప్పు

-

కోస్తాంధ్రకు ‘టిట్లీ’ తుఫాను ముప్పు ముంచుకు వస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలపడుతూ ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ప్రయాణిస్తుండటంతో  ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం నిపుణులు చెబుతున్నారు.. సోమవారం రాత్రికి కళింగపట్నం, గోపాల్‌పూర్‌ల మధ్య దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉన్నట్లు తెలిపారు.. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుండడంతో రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు.

కోస్తా జిల్లాల్లో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తుఫానుగా మారిన తర్వాత గాలుల తీవ్రత 90 కిలోమీటర్ల వేగం వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర కోస్తా అధికారులను అప్రమత్తం చేశామని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ డి.వరప్రసాద్‌ తెలిపారు. మత్స్యకారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news