గడ్డం పెంచితే గబ్బర్ సింగ్ అయిపోతారా? కేటీఆర్

-

అపవిత్ర, నీచమైన కలయికకు నిదర్శనం తెదేపా – కాంగ్రెస్

ఎన్నికలు అర్థరాత్రి వచ్చినా సరే మేం సిద్ధమే అని చెప్పుకున్న నాయకులు.. కేసీఆర్ ని  ఎదుర్కొనేందుకు అపవిత్ర, నీచమైన బంధానికి తెరతీశారని మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో తెరాసలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక్కటవుతున్నారని, గత ఆరు దశాబ్దాల పాలనలో తెలంగాణ ప్రజలను వంచించింది సరిపోలేదరన్నట్లూ తెదేపా – కాంగ్రెస్ జత కట్టడాన్ని ప్రజలు గమనించాలని గుర్తుచేశారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పాలన, 17 ఏళ్ల తెదేపా పాలించిన తర్వాత పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నాలుగున్నరేళ్ల తెరాస  పాలించింది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఓ ప్రత్యామ్నాయం ఎంచుకునేందుకు మంచి అవకాశం దొరికిందన్నారు. రైతులకు సరైన కరెంటు ఇవ్వకపోగా, వారిని నడిరోడ్డుపై కాల్చి చంపిన పార్టీలు నేడు రైతు ప్రయోజనాల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవం – ఢిల్లీకి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు.

మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి …  ప్రతీ నిర్ణయం కోసం ఢిల్లీ వైపు, అమరావతి వైపు చూడాలనుకుంటే మనం సాధించుకున్న తెలంగాణకు అర్థం లేనట్లే అన్నారు. గడ్డం పెంచుకున్నవాళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరని.. మీరు గడ్డం తీయకపోతే ఇక్కడ ఎవ్వరికీ నష్టం రాదన్నారు. కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు పథకాలు, రైతులకు ఉచిత కరెంటు తో పాటు ఇతర సంక్షేమ పథకాలే మమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version