ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి ఘటనలో గవర్నర్ నరసింహన్ వ్యవహరించిన తీరు పద్ధతిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి సంబంధించిన ఏమైనా వివరాలు కావాలంటే నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలి గాని డీజీపీకి ఎలా చేస్తారని ప్రశ్నించారు. తొలిసారిగా తాను గవర్నర్ తీరుపై స్పందిస్తున్నానని వెల్లడించారు. పరిపాలనలో వేలు పెట్టే అధికారం గవర్నర్‌కు లేదని, ఢిల్లీ స్క్రిప్ట్‌ను ఇక్కడ అమలు చేయాలని చూస్తే కుదరని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ గవర్నర్ వ్యవస్థపై నాటి నుంచి నేటి వరకు పోరాటం చేస్తుందన్నారు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చజరగాలని సీఎం ఆశించారు.