మట్టిలోన మట్టిరా దేహమన్నది.. వీర్యపు కణమై కడుపున పడుతూ నెల నెల ఎదిగిన ఓ శిశువా.. తనువే తొడిగి భువిలో పడుతూ తెలియని పుట్టుక నీది కదా.. పూర్వ జన్మాల స్మృతిని.. మరిచిపోయావు మానవా… వావ్.. లిరిక్స్ సూపర్ కదా. మనిషి జీవితం గురించి అద్భుతంగా రాశారు కదా. శ్రీరామ్ తపశ్వీ ఈ పాటను రాయగా.. బిత్తిరి సత్తి పాడాడు.
దిక్సూచి టైటిల్ ట్రాక్ పేరుతో బిత్తిరి సత్తి యూట్యూబ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ సాంగ్ ను దివ్యాంగ పిల్లలు రిలీజ్ చేశారు. వీడియో డిస్క్రిప్షన్ ప్రకారం దిక్సూచి.. ఇది ఓ సామాన్యుడి సినిమా పేరుతో ఓ సినిమా వస్తున్నది. ఆ సినిమాలోని టైటిల్ ట్రాకే ఈ పాట. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా దిక్సూచి టైటిల్ ట్రాక్ విని ఎంజాయ్ చేయండి.