గులాబీ దళానికి తొలి వర్కింగ్ ప్రెసిడెంట్…

-

తెలంగాణను సాధించిన తెరాస పార్టీకి తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుని తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నియామకం గురించి కేసీఆర్‌ వివరించారు. దీంతో అధినేత నిర్ణయానికి కార్యవర్గం సంపూర్ణ ఆమోదం తెలిపడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ని నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.

రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ప్రజలు మరోసారి తెరాసకు భారీ మెజారిటీతో అధికారం అప్పగించడంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించడంతోపాటు జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌పై మరింత బాధ్యత పెరగనుంది..దీంతో తెరాసను, రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో తాను అకునున్నవిధంగానే ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, కేటీఆర్‌కు కేసీఆర్‌ అప్పగించారు. తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా తెరాసను మరింత పటిష్టం చేయాల్సిందిగా కేటీఆర్‌కు సూచించారు. కేటీఆర్ కి పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగించడంతో తెరాస వర్గాల్లో సంబరాలు అంబారాన్ని అంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version