ఫోన్ పేలి వృద్ధుడు మృతి… ఆ ఫోన్లను పారేస్తున్నారు..!

-

Old man in rajasthan died after phone blasted in his pocket

ఫోన్ పేలి ఓ వృద్ధుడు మృతి చెందాడు. దీంతో ఆ మోడల్ కు సంబంధించిన ఫోన్లంటినీ జనాలు పడేస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్ లోని పాచ్లీ అనే గ్రామంలో చోటు చేసుకున్నది. కొన్ని రోజుల కింద రాజస్థాన్ ప్రభుత్వం పథకం కింద సబ్సిడీ మీద ప్రజలకు ఫోన్ ను అందించింది. ఆ ఫోన్ ను తీసుకున్న ఓ వృద్ధుడు ఫోన్ పేలిపోవడంతో సజీవ దహనమయ్యాడు. తన జేబులో ఉన్న ఫోను ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ వ్యక్తికి నిప్పంటుకుంది. దీంతో మంటల్లోనే కాలి సజీవ దహనం అయ్యాడు.

ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన ఫోన్ పేలిపోయిందని తెలుసుకున్న గ్రామస్తులువెంటనే ఆ ఫోన్లను పడేశారు. ఫోన్ పెద్ద శబ్దంతో వచ్చి పేలిపోయిందని.. బ్యాటరీప్రాబ్లమ్ తో పేలిపోయి ఉంటుందని.. దీనిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version