ఘోర రోడ్డు ప్రమాదం..

-

పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు  ట్రాలీ ఆటోలో వెళ్లున్న వారిని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా… మరో 15 మంది  తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ఆలూరు మండల పరిధిలోని పెద్దహోతూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version