“చైనా పీస్ “ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన హీరో నిఖిల్….

-

అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో హాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “చైనా పీస్”. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ సినిమా ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.లిప్‌స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ పోస్టర్‌ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

దేశభక్తి, ఇండియా-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ ను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news