రేపు అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్..

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలవనున్నారు. ఈ మేరకు అతని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తో భేటీ కానున్నాడు.ఈ భేటీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై చర్చలు జరపనున్నారని సమాచారం. ఈ చర్చల అనంతరం ఉమ్మడి కూటమి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాగా, ఇవాళ ఉదయం రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమై అనూహ్యంగా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని పేర్కొన్నారు.

దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కూటమిలో చీలికలు ఏర్పడడంతోనే టీడీపీ ప్రకటించిన సీట్లకు కౌంటర్‌గా పవన్ కల్యాణ్ స్థానాలు ప్రకటించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ….పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని ,చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేష్‌ ప్రకటించినా తాము మౌనంగా ఉన్నామని గుర్తు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news