మంగళవారం నాలుగు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకోగా ‘బింబిసార’, ‘భగవంత్ కేసరి’ పలు అవార్డులకు ఎంపికయ్యాయి. ‘మంగళవారం ‘ సినిమా హీరోయిన్ పాయల్ కి ఉత్తమ నటి అవార్డు, ‘భగవంత్ కేసరి’హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆనర్ ఆఫ్ ది సినిమా అవార్డు’ అందుకోనున్నారు. ‘మంగళవారం’ సినిమా దర్శకుడు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తన టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తమ నటుడు రణ్‌బీర్, ఉత్తమ హీరోయిన్ గా అలియా భట్,ఉత్తమ చిత్రం 12th ఫెయిల్ గా ఎంపికయ్యాయి.జైపుర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జరగనున్న వేడుకలో విజేతలకు అవార్డులు అందజేస్తారు.
ఆనర్ ఆఫ్ ది సినిమా అవార్డు
ప్రకాశ్ రాజ్: బింబిసార
అర్జున్ రాంపాల్: భగవంత్ కేసరి
అనుపమ్ ఖేర్: కార్తికేయ-2
కాజల్ అగర్వాల్: భగవంత్ కేసరి
‘మంగళవారం’ పురస్కారాలివీ..
ఉత్తమ నటి: పాయల్ రాజ్‌పుత్
బెస్ట్ సౌండ్ డిజైన్: ఎం. ఆర్. రాజా కృష్ణన్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: ముదస్సర్ మహ్మద్
బెస్ట్ ఎడిటింగ్: గుళ్లపల్లి మాధవ్ కుమార్
ఫీచర్ ఫిల్మ్: జె.ఐ.ఎఫ్.ఎఫ్. ఇండియన్ పనోరమ
గోల్డెన్ క్యామెల్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్:వశిష్ఠ (బింబిసార)
బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్: బింబిసార
ఉత్తమ నటి: శ్రీలీల (భగవంత్ కేసరి)
రెడ్ రోజ్ అవార్డ్ ఫర్ బెస్ట్ రిలీజ్‌డ్ ఫిల్మ్: బింబిసార