గాజా: హమాస్-ఇజ్రాయెల్ లా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నది. దీంతో హమాస్‌కు ముఖ్య స్థావరంగా గాజా స్ట్రిప్ ఎప్పుడు బాంబుల సౌండ్ తో దద్దరిళ్లుతున్నది. ఈ యుద్ధంలో పాలస్తీని యాన్లు భారీ సంఖ్యలో చనిపోయారు. గత 48 గంటల్లో ఇజ్రాయిల్ సైన్యం 350 మందిని చంపేసిందని హామాస్ ప్రభుత్వం వెల్లడించింది.దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉన్న నాజర్ హాస్పిటల్‌లో చనిపోయిన వారిని స్థానికులే ఖననం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నది.
హాస్పిటలును ఇజ్రాయిల్ సైన్యం ముట్టడించడం వల్ల రోగులకు వైద్య సాయం అందకుండా పోయిందని చెప్పింది. గాజాలో ఇప్పటివరకు 26,422 మంది పాలస్తీనియనల్లు ఇజ్రాయెల్ దాడితో మరణించారు.ఇజ్రాయెల్ దాడితో మరో 65,087 మంది గాయపడ్డారు. గత ఏడాది అక్టోబర్ 3 నా హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. కొన్ని లక్షల మంది ప్రజలు నగరాన్ని విడిచి వెళ్లిపోయారనీ హమాస్ ఆరోగ్యశాఖ వెల్లడించింది.