టైసన్ నాయుడుగా వస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్…

-

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేయగా అది భారీ డిజాస్టర్ను మూటగట్టుకుంది. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాగర్ . కె దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈరోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్డే కావడంతో అతని తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ,టైటిల్ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం టైటిల్ టైసన్ నాయుడుగా కాగా ఈ చిత్రాన్ని రాము ఆచంట ,గోపి ఆచంట 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇది పదో చిత్రం కాగా ఇందులో పోలీస్ గెటప్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 

 

ఈ సినిమా దర్శకుడు ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమాని తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నయి.ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి భీమిలి సిసిరో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news