వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల

-

వైనాట్ 175 లక్ష్యమే నినాధంగా ముందుకెళుతోంది ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. విజయo కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేశారు. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. మొత్తం 175కు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంగా శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ ఈ జాబితాను తయారుచేసినట్లు తెలుస్తోంది.ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి కాబట్టి అందుకు అందరూ సహకరించాలని సీఎం కేడర్ కు సూచించారు. పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

సామాజిక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు. వాటి వివరాలు ఇవి…

1) అనంతపురం ఎంపీ – మాలగుండ్ల శంకరనారాయణ
2) హిందూపురం ఎంపీ – జోలదరాశి శాంత
3) అరకు ఎంపీ (ఎస్టీ) – కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
4) రాజాం (ఎస్సీ) -తాలె రాజేష్‌
5) అనకాపల్లి – మలసాల భరత్‌ కుమార్‌
6) పాయకరావుపేట (ఎస్సీ) – కంబాల జోగులు
7) రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాష్‌
8) పి.గన్నవరం (ఎస్సీ) – విప్పర్తి వేణుగోపాల్‌
9) పిఠాపురం – వంగ గీత
10) జగ్గంపేట – తోట నరసింహం
11) ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు.
12) రాజమండ్రి సిటీ – మార్గాని భరత్‌
13) రాజమండ్రి రూరల్‌ -చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
14) పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి
15) కదిరి – బి ఎన్ మక్బుల్ అహ్మద్
16) ఎర్రగొండపాలెం (ఎస్పీ) – తాటిపర్తి చంద్రశేఖర్‌
17) ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్‌
18) తిరుపతి – భూమన అభినయ్‌ రెడ్డి
19) గుంటూరు ఈస్ట్‌ – షేక్‌ సూరి ఫాలిమా
20) మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
21 చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి
22) పెనుకొండ – కె.వి. ఉషా శ్రీచరణ్‌
23) కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
24) అరకు (ఎస్టీ) – గొడ్డేటి మాధవి
25) పాడేరు (ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
26) విజయవాడ సెంట్రల్‌ – వెలంపల్లి శ్రీనివాస రావు
27) విజయవాడ వెస్ట్‌ – షేక్‌ ఆసిఫ్‌

Read more RELATED
Recommended to you

Latest news