తిరుమల తిరుపతి దేవస్థానంపై పిటిషన్

-

హైకోర్టుకు వెళ్లండి…సుప్రీం సూచన

కొద్ది నెలల క్రితం  తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పై చెలరేగిన వివాదంపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం పిటిషన్ కు సంబంధించిన విషయాలను విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్లాలని పిటిషనర్ కి సూచించింది.   తితిదే ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, అర్చకుల వయోపరిమితి తదితర అంశాలపై నాడు చెలరేగిన వివాదం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

కోర్టు సూచనను ట్విటర్ వేదికగా సుబ్రహ్మణ్యస్వామి పంచుకున్నారు. ‘తిరుపతి విషయంలో నేను వేసిన పిటిషన్ పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ఆదేశించింది…ఇప్పుడు నేను హైకోర్టుని ఆశ్రయిస్తాను ఇది మంచి ఆరంభం’ అంటూ ఆయన ట్విటర్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news