భాజపా నేత, కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జె.పి.నడ్డా సోమవారం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. భాజపా పార్టీ కార్యాలయంలో జరిగే వర్క్‌షాప్‌లో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజేంద్రనగర్‌లో జరిగే సదస్సుకు నడ్డా హాజరుకానున్నారు. తెలంగాణలో తమ పట్టు పెంచుకునే విధంగా భాజపా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, భాజపా నేతలను రాష్ట్రానికి పంపి పార్టీ కేడర్ ని ఉత్సాహపరుస్తున్నారు.