తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సలార్…..

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు ఎక్కువగా కనబడుతున్నాయి. తాజాగా సలార్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. నాలుగవ రోజు అత్యధిక షేరు వసూలు చేసిన సినిమాల జాబితాలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది. గతంలో 17.73 కోట్లతో మొదటి స్థానంలో ఉన్న ఆర్ఆర్ ఆర్ సినిమాని దాటి 18.05 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

 

ఇక మూడవ స్థానంలో బాహుబలి 2 – 14.65 కోట్లు, ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట – 12.06 కోట్లు, అల వైకుంఠపురములో – 11.56 కోట్లు, వాల్తేర్ వీరయ్య – 11.42 కోట్లు, కేజీఎఫ్ 2 – 10.81 కోట్లు, సాహో – 9.60 కోట్లు, సరిలేరు నీకెవ్వరు- 8.67 కోట్లు, మహర్షి – 8.44 కోట్లు, అఖండ – 8.31 కోట్లు షేర్ సాధించి 4వ రోజు అత్యధిక షేర్ సాధించిన టాప్ టెన్ సినిమాలుగా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news