దేవర పోస్టుపోన్ అయితే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ – దిల్ రాజు

-

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఈ చిత్రంలో అలనాటి తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రానుందని తెలుస్తుంది. ఇప్పటికే మేకర్స్ మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరగనున్నాయి.ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న సైప్ ఆలి ఖాన్ ఇటీవలే గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కారణాలవల్ల ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో…. ఒకవేళ వేసవిలో విడుదల కావలసిన దేవర సినిమా వాయిదా పడితే తాము పోటీలో ఉంటామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ‘దేవర వాయిదా పడితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ను రిలీజ్ చేస్తాం. ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చాం’ అని చెప్పారు. ఇటు ఫిబ్రవరి 9న విడుదల అవుతున్న రవితేజ ఈగల్ సినిమాకు వీలైనన్నీ ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news