ఆర్థిక శాఖ నివేదికలో కీలక అంశాలు ఇవే..!

-

మనదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించి 2030 నాటికి రూ.5.83 కోట్లకు చేరుతుందని.. అంటే (7 ట్రిలియన్ డాలర్లు) తాజాగా వెలువడిన కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక అంచనా వేసింది. 1 ట్రిలియన్ డాలర్లు అంటే.. రూ.83లక్షల కోట్లకు సమానం. రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధి రేటు 7 శాతాన్ని దాటుతుందని పేర్కొంది. గురువారం రోజు పార్లమెంట్ లో 2024-25 మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

ఈ నేపథ్యంలో సోమవారం రోజు భారత ఆర్థిక వ్యవస్థ-ఒక సమీక్ష పేరుతో నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. వచ్చే మూడేళ్లలో దేశపు జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరి.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఈ నివేదిక తెలిపింది. అయితే 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర సర్కారు ముందుకుపోతోంది. ఇక ఆర్థిక సర్వే రిపోర్టు సార్వత్రిక ఎన్నికల తరువాత పూర్తి బడ్జెట్ కి ముందు వెలువడుతుందని ఆర్థికశాఖలోని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ వెల్లడించారు. 

Read more RELATED
Recommended to you

Latest news