ద లీడర్‌ ఈజ్‌ బ్యాక్‌ అండ్ రెడీ టు మేక్‌ వేవ్స్‌.. కేసీఆర్‌ గురించి ఎక్స్‌లో ఎంపీ సంతోష్‌రావు పోస్ట్‌…

-

బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మొదటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రమంగా కోలుకుంటున్నారు. బాత్రూమ్‌లో జారిపడిన కారణంగా తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న కెసిఆర్ నంది నగర్‌లోని తన నివాసంలో గత కొన్ని వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు నేడు తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్ దంపతులు కెసిఆర్ నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ కుర్చిలో కూర్చుని గవర్నర్ దంపతులతో ముచ్చటించారు. శస్త్రచికిత్స తర్వాత బెడ్‌కే పరిమితమైన కెసిఆర్ లేచి కుర్చీలో కూర్చోవడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ గురించి బీఆర్‌ఎస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు ఆసక్తి కరమైన ట్వీట్‌ చేశారు. ‘నాయకుడు తిరిగొచ్చాడు, సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు’ (ద లీడర్‌ ఈజ్‌ బ్యాక్‌ అండ్‌ రెడీ టు మేక్‌ వేవ్స్) అంటూ ఎక్స్‌ లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version