నా ఇంటినే ముందు కూల్చేయండి’.. కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం

-

Telangana: కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌ నుంచి అడ్లూర్‌ రోడ్డు వరకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. చాలా మంది తమ నిర్మాణాలు కూల్చటానికి అంగీకరించడం లేదు. ఇద్దరు ఉద్దండులను ఓడించి జెయింట్ కిల్లర్ పేరొందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మంచి మనసు చాటుకున్నారు. కామారెడ్డిలో రోడ్ల విస్తరణకు నిర్ణయం తీసుకున్న అధికారులు పలు నిర్మాణాలను కూల్చివేయాల్సి వచ్చింది. ఇందులో ఎమ్మెల్యే ఇల్లు కూడా ఉంది. దీనికి ఏమాత్రం అభ్యంతరం చెప్పని ఆయన రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు.ఇదే రోడ్డులో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఇల్లు కూడా ఉంది.

గతేడాధి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ,రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి లను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news