నా కెరీర్ బెస్ట్ సీజన్ల‌లో ఇదొక‌టి.. కొత్త ఏడాదిలోనూ జోరు కొన‌సాగిస్తా : జ‌కోవిచ్

-

సెర్బియా ప్లేయర్ జకోవిచ్ మరో ఏడాది నెంబర్ వన్ గా నిలుస్తూ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సంవత్సరం మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్ లు సాధించిన జకోవిచ్ …. టోటల్ గా 24 గ్రాండ్ స్లామ్ టైటిలను గెలిచి చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. నా జీవితంలో 2023 సంవత్సరం ఒక బెస్ట్ సీజన్ కాకపోతే ఇదే అత్యుత్తమం అని చెప్పలేను. గతంలోనూ ఒకే ఇయర్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ టైటిలను గెలిచానని పేర్కొన్నారు. వింబుల్దన్ లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదని ప్రస్తుతం నేను కోర్టులో చురుకుగా కదులుతున్నానని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ఓపెన్ తో టైటిల్ సొంతం చేసుకున్న జకోవిచ్ యూఎస్ ఓపెన్ విజేత గా నిలిచి ఈ సంవత్సరం ముగించాడు. వీటితో పాటు వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.అత్య‌ధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లో ర‌ఫెల్ నాద‌ల్ ను అధిగమించాడు. వచ్చే ఏడాది కూడా ఇదే జోరు కొనసాగించాలని భావిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news