నా మూడు సినిమాలు నాకు నచ్చలేదు-ప్రశాంత్ నీల్

-

ఉగ్రం సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలో కి అరంగేట్రం చేసిన ప్రశాంత్ నీల్ …. ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత తీసిన కేజిఎఫ్ బాక్స్ ఆఫీస్ ని ఎంతలా షేక్ చేసిందో మనకి తెలిసిందే. కేజిఎఫ్ ని రెండు పార్ట్స్ గా తీసి ఇండియన్ మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి

 

ఈ మూవీ ఈనెల 22వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. విడుదలకి సంబంధించిన తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ కి సంబంధించిన పనులను ప్రారంభించింది.

అయితే ఈ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కే జి ఎఫ్ సినిమాలో చేసిన తప్పులే ఈ సినిమాలో కూడా చేశానని… రిలీజ్ కు ముందు తన సినిమాలను చూసుకోలేదని అలాగే మార్పులు చేసే సమయం కూడా లేదని తెలిపాడు. ప్రస్తుతం తాను తీసిన మూడు సినిమాలు విడుదలకు ముందు తనకు నచ్చలేదని చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు…. కానీ ఈసారి నేను భయపడ్డాను ఎందుకంటే నాకు ఈ సినిమా నచ్చింది చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news