నిరుద్యోగులకి గుడ్ న్యూస్… విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో అవకాశం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? బీటెక్ పూర్తి చేసేశారా…? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అనుభవం వున్నా వాళ్ళకి ఇది సువర్ణావకాశం అనే చెప్పాలి.

మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఆలస్యమెందుకు ఇక పూర్తిగా చూసేయండి. ఈ పోస్ట్ వివరాల లోకి వెళితే… కేవలం ఒక్క పోస్టు మాత్రమే భర్తీ చేయనున్నారు. ఎంపిక అయిన వాళ్ళు విశాఖపట్నం లో పని చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థికి రూపాయలు 60 వేల నుంచి లక్షా ఎనభై వేల వరకూ జీతం ఉంటుంది.

అప్లై చేయడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 19. అలానే 40 ఏళ్ళు మించి ఉండరాదు గమనించండి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే వాళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీ లో ఉత్తీర్ణత అయి ఉండాలి. కేవలం మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు కమ్యూనికేషన్ స్ట్రీమ్స్ లో వాళ్లకి మాత్రమే అవకాశం.

ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వస్తే… ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ని తీసుకుని అక్కడ వివరాలన్నీ నింపాల్సి ఉంటుంది. అలానే అవసరమయ్యే డాక్యుమెంట్స్ ని కూడా సబ్మిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version