పంచముఖ హనుమాన్‌లో ఏయే రూపాలు ఉంటాయో తెలుసా!

-

 

ఆంజనేయుడు అంటే చాలు అందరికీ ఇష్టమైన దేవుడు. సకల భయనివారకుడు, సకలకార్యజయకారకుడు. అయన అనేక రూపాలు ధరించాడు. వాటిలో ప్రముఖమైన వాటిలో పంచముఖ హనుమాన్ ఒకటి. అయితే పంచముఖాలలో ఐదు తలలు, పదిచేతులతో కనిపిస్తాడు. ఆంజనేయుని పంచముఖాలలో మధ్య ముఖం నిజ ముఖం. దీన్ని పూర్వ ముఖం అని కూడా అంటారు. బలాన్ని, ధైర్యాన్ని పొందేందుకు ఈ రూపాన్ని పూజిస్తారు. ఇక ఆంజనేయుని దక్షిణ ముఖం నారసింహం. కీర్తిని ఐశ్వర్యాన్ని పొందేందుకు ఈ స్వరూపాన్ని ఆరాధిస్తారు.

ఆంజనేయ పశ్చిమ ముఖం గారుత్మంతం. ఈ ముఖాన్ని కార్యసాధనకు ఈ రూపాన్ని ఆర్చిస్తారు.నాల్గోవ ముఖమైన వారాహం ఆంజనేయుని ఉత్తర ముఖమని చెప్తారు. భూత, ప్రేత, పిశాచాల నుంచి రక్షణ కోసం ఆరోగ్యం కోసం ఈ రూపాన్ని పూజిస్తారు.చివరదైన ఆంజనేయుని ఊర్థ ముఖం హయగ్రీవ ముఖం. ఈ ముఖాన్ని అర్చించడం వల్ల అజ్ఞానం తొలిగి జ్ఞానం లభించడమే కాకుండా శుత్రవులపై విజయం కూడా లభిస్తుంది.ఇక ఆలస్యమెందుకు అన్ని రకాల కోరికలను తీర్చే శ్రీఘ దేవతా రూపం ఆంజనేయుడుని ఆరాధించండి. సకల జయాలను పొందండి.
జై హనుమాన్

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version