పాట్నా బాంబ్ బ్లాస్ట్ కేసులో 4 గురికి ఉరిశిక్ష.. తీర్పు వెల్లడించిన ఎన్ఐఏ కోర్ట్

-

2013లో జరిగిన పాట్నా సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్ట్ తీర్పును వెల్లడించింది. అక్టోబర్ 27న 9 మందిని దోషులుగా తేలుస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చింది. తాజాగా వీరికి శిక్షలు ఖరారు చేసింది. వీరిలో నలుగురికి ఉరి శిక్ష విధించగా, ఇద్దరికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి 10 ఏళ్ల శిక్షను విధించింది. 2013లో పాట్నాలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన హూంకార్ ర్యాలీలో వరసగా బాంబు పేలుళ్లు జరిగాయి. పేలుళ్లు సంభవించిన తర్వాత కూడా మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ ఘటనలో మొత్తం 6 గురు మరణించగా, 80 మంది గాయపడ్డారు. నిందితులందరూ స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా( సిమి), ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు. ఘటన జరిగిన గాంధీ మైదాన్ చుట్టుపక్కల మొత్తం 17 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు కనుక్కున్నారు. వీటిలో 7 బాంబులను పేల్చబడ్డాయి. నిందితుల్లో చాలా మంది జార్ఖండ్ రాష్ట్రం సిథియో ప్రాంతానికి చెందిన వారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version